
Follow
Follow

తే. 29.07.25 న ప్రాంతీయ శిక్షణ & క్యాంపు కేంద్రం, విజయనగరంలో జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ యు మాణిక్యం నాయుడు గారి ఆదేశానుసారం భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఒక రోజు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నిర్వహించబడినదని జిల్లా కార్యదర్శి శ్రీ వాక చిన్నం నాయుడు తెలియజేశారు. జిల్లాలోని 45 పాఠశాలల నుండి స్కౌట్ మాస్టర్స్ మరియు గైడ్ కెప్టెన్స్ 68 మంది పాల్గొన్నారు. వీరికి క్షేత్ర స్థాయిలో పాఠశాలల్లో నిర్వహించవలసిన కార్యాచరణ పట్ల అవగాహన కల్పించే లక్ష్యంగా ఈ శిక్షణ జరిగింది. ఇదే సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఆగస్టు లో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ కవాతుదళమునకు జిల్లా నుండి పంపవలసిన స్కౌట్స్ & గైడ్స్ ఎంపిక కార్యక్రమం జరిగింది.18 పాఠశాలల నుండి 60 మంది హాజరు కాగా ఉత్తమ ప్రతిభ కనపరచిన ఏ. మహేష్ (zphs కొండ గండ్రేడు), చంద్రమౌళి(zphs కుమారాo), హేమచంద్ర (zphs చీపురుపల్లి), ఎస్ కుసుమ (zphs కొత్తవలస), జె పూజిత (zphs కుమారాo), డిల్లేశ్వరి (zphs చీపురుపల్లి), వారు ఎంపిక చేయబడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ లు శ్రీ ch.నారాయణమూర్తి, త్రినాథ్ నాయుడు, జిల్లా కమీషనర్ (అడల్ట్ రిసోర్స్) బి. పి.ఏ. రాజు , డి. ఓ.సి (ఎస్) డి ప్రవీణ్ కుమార్,హెడ్ క్వార్టర్ కమీషనర్ శ్రీ s s దొర , ట్రెజరర్ ఎం భాస్కరరావు, ASOC శ్రీ దుర్గా నాగేశ్వరరావు , సహ కార్యదర్శి s. కనక లక్ష్మీ డి.టీ.సి. లు ఏ కనక లక్ష్మి, సూరిబాబు, బేసిక్ స్కౌట్ మాస్టర్స్ , గైడ్ కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ సందర్భమును పురస్కరించుకొని అనంతరం ఇటీవల వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి స్కౌట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందని సెక్రటరీ చిన్నం నాయుడు తెలిపారు.



Follow ( 0 Followers ) X Follow E-mail : * Follow Unfollow తే. 29.07.25 న ప్రాంతీయ శిక్షణ & క్యాంపు కేంద్రం, విజయనగరంలో జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ యు మాణిక్యం నాయుడు గారి ఆదేశానుసారం భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఒక రోజు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నిర్వహించబడినదని జిల్లా కార్యదర్శి శ్రీ వాక చిన్నం నాయుడు తెలియజేశారు. జిల్లాలోని 45 పాఠశాలల నుండి స్కౌట్ మాస్టర్స్ మరియు…

